మహిళల భద్రత.. మొదటి ప్రాధాన్యత.

ఎస్పీ అఖిల్ మహాజన్. 

సిరిసిల్లలో అవగాహన సదస్సు.

సిరిసిల్ల. (తెలంగాణ ప్రభ) మహిళల భద్రత కే తొలి ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. బుధవారం సిరిసిల్ల పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన సదస్సు హాజరైన ఎస్పీ అఖిల్ మహాజన్ మాట్లాడుతూ విద్యార్థులను చైతన్యపరిచి ఉద్దేశంలో భాగంగా అవగాహన సదస్సు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులకు మహిళలకు రక్షణ, షీ టీమ్స్, ఈవ్ టీజింగ్, పోక్సో, సైబర్ క్రైమ్ ఇతర అంశాలపై మాట్లాడారు. విద్యార్థులు ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ లకు దూరంగా ఉండాలని సూచించారు. ఆన్లైన్ మోసాలు ఎక్కువగా జరుగుతున్న క్రమంలో జాగ్రత్తగా ఉండాల్సిందిగా సూచించారు. విద్యార్థి దశ నుండి ఉన్నత లక్ష్యాలను ఎంచుకొని క్రమశిక్షణ పట్టుదలతో ముందుకు సాగాలని అన్నారు. కార్యక్రమంలో వేములవాడ ఏఎస్పి శేషాద్రిని రెడ్డి, డీఎస్పీ చంద్రశేఖర్, సిఐ కృష్ణ, షీ టీం ఏఎస్ఐ ప్రమీల, షీ టీ సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు


.