చేనేత కళాకారుల నైపుణ్యం అపురూపమైనది : ఆది శ్రీనివాస్, ప్రభుత్వ విఫ్

ఆది శ్రీనివాస్, ప్రభుత్వ విఫ్ 

ఘనంగా జాతీయ చేనేత దినోత్సవం.

సిరిసిల్ల.(తెలంగాణ ప్రభ) చేనేత కళాకారుల నైపుణ్యం అపూర్వమైనదని ప్రభుత్వ విప్ , వేములవాడ శాసనసభ్యులు శ్రీనివాస్ అన్నారు. బుధవారం జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన కార్యక్రమానికి హాజరయ్యారు. పాత బస్టాండ్ నూతన్న విగ్రహం వద్ద జరిగిన వేడుకల్లో పాల్గొన్నారు. మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేనేత కార్మికులకు చేయూత అందించేందుకు కృషి చేస్తుందని తెలిపారు. చేనేత కార్మికుల నైపుణ్యం అపురూపమైందని అన్నారు. కార్యక్రమంలో

కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, సిరిసిల్ల మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళ, కే కే మహేందర్ రెడ్డి, హ్యాండ్లూమ్ అండ్ టెక్స్ టైల్ శాఖ ఏడీ సాగర్, పలువురు అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

.