సిరిసిల్ల. (తెలంగాణ ప్రభ) జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని సిరిసిల్ల పట్టణం గణేష్ నగర్ లోని జగదాంబ చేనేత సహకార సంఘంలో చేనేత కళాకారులకు బిజెపి ఆధ్వర్యంలో బుధవారం సన్మానం చేశారు. ఈ సందర్భంగా బిజెపి పట్టణ అధ్యక్షులు నాగుల శ్రీనివాస్ మాట్లాడుతూ చేనేత కళ లకు జీవితం ధారపోసిన కళాకారుల నైపుణ్యం గొప్పదని అన్నారు. కార్యక్రమంలో బిజెపి చేనేత సెల్ కన్వీనర్ తౌటు రాజలింగం, మాజీ మున్సిపల్ చైర్మన్ రవీందర్, గాజుల సదానందం, గుండెల్లి వేణు, అంకారపు రాజు, మోర రవి, అల్వాల నరహరి, మెరుగు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
