పర్యావరణాన్ని కాపాడే బాధ్యత అందరిది

జిందం కళ చక్రపాణి, మున్సిపల్ చైర్ పర్సన్. 

సిరిసిల్ల. (తెలంగాణ ప్రభ) పర్యావరణాన్ని కాపాడే బాధ్యత అందరిపై ఉందని సిరిసిల్ల మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళా చక్రపాణి అన్నారు. మంగళవారం సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని మూడవ వార్డులో స్వచ్ఛ ధనం పచ్చదనం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళ చక్రపాణి మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యాల పరిరక్షణ కోసం ప్రకృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని అన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. పచ్చదనాన్ని కాపాడేందుకు చెట్లను పెంచాల్సిన బాధ్యత అందరిపై ఉందని పేర్కొన్నారు. కార్యక్రమంలో డి ఈ ప్రసాద్, ఏఈ నరసింహస్వామి, టి పి ఎస్ అభినవ్, సానిటరీ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ, మున్సిపల్ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.

.