తెలంగాణ ప్రభ (కోటగిరి): కోటగిరి మండల పరిధిలోని కొత్తపల్లి గ్రామంలో పాఠశాల ఆవరణలో తహసిల్దార్ కే. గంగాధర్ స్వచ్ఛ ధనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా మొక్కను నాటారు. ఆయన మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు గ్రామాలలో నిర్వహించడం జరుగుతుందని అన్నారు. పాఠశాల ఆవరణలోని పరిశుభ్రతను పాటించాలని విద్యార్థిని విద్యార్థులకు సూచించారు. పరిసరాలను శుభ్రంగా ఉంచుతూ, ఆరోగ్యం పట్ల వ్యక్తిగత శుభ్రతను పాటించాలని అన్నారు. నీటి ట్యాంకులకు క్లోరినేషన్ చేయించాలని జిపి సిబ్బందికి ఆదేశించారు. గ్రామంలో పల్లె దావఖాను పరిశీలించారు. ఆశా వర్కర్లకు సీజనల్ వ్యాధులపై గ్రామస్తులకు అవగాహన కల్పించాలని అన్నారు .గ్రామాలలో శానిటేషన్ క్లోరినేషన్ పనులను చేపట్టాలని ఆదేశించారు. గ్రామంలోని ఇంకుడు గుంతలు నిర్మించాని వారి ఇండ్లను గుర్తించాలన్నారు. చెరువు కట్టల బలోపేతం కొరకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. గుంతలలో నీటిని నిల్వ ఉంచరాదని అన్నారు. వేడి చేసి చల్లార్చిన నీటిని త్రాగాలన్నారు. సీజనల్ వ్యాధులపై గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి,తహశీల్దార్, ఎంపీడీవో ఎంపీవో,ఈజీఎస్ సిబ్బంది పంచాయతీ కార్యదర్శి, పాఠశాల కమిటీ చైర్మన్, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
