స్వచ్చదనం - పచ్చదనంకు ఊతం ఇద్దాం - మెటుపల్లి డివిజనల్ ఇంజనీర్ పి.తిరుపతి

తెలంగాణ ప్రభ (కోరుట్ల): పల్లెలు, పట్టణాలు పారిశుద్ధ్యం, స్వచ్చదనం - పచ్చదనం చేయాలనే సమాలోచనతో  ప్రణాళికాయుతంగా ముందుకు వెళ్తున్న ప్రభుత్వానికి ఊతం అందిద్దామని విద్యుత్ శాఖ మెట్ పల్లి డివిజనల్ ఇంజనీర్ పి.తిరుపతి అన్నారు. 

మంగళవారం స్వచ్చదనం - పచ్చదనంలో భాగంగా విద్యుత్ శాఖ అధికారులు మన్నెగూడెం విద్యుత్ సబ్ స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటారు. 

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ 5 నుండి 9వ తేదీ వరకు మెటుపల్లి డివిజన్ పరిధిలోని  ప్రతీ విద్యుత్ కార్యాలయంలో మొక్కలు నాటి స్వచ్చదనం-పచ్చదనం ప్రాముఖ్యతను చాటిచెబుతూ ప్రకృతి పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతగా భాగస్వామ్యం చేసేందుకు పునరంకితమై పని చేయాలనే సంకల్పంతో ఉన్నామని డివిజనల్ ఇంజనీర్ పి.తిరుపతి తెలిపారు , 

ఈ కార్యక్రమంలో ఏడిఈ  కోరుట్ల రూరల్ రఘుపతి,మన్నెగూడెం ఏఈ రామ్మోహన్ రావు , సబ్ ఇంజనీర్ ఎక్కల్ దేవి హరిప్రసాద్, ఏఈలు నవీన్ , విశ్వతేజ, సబ్ ఇంజనీర్లు ప్రవీణ్ , రాజశేఖర్ , సతీష్, సిబ్బంది పాల్గొన్నారు.

.