కోరుట్ల పట్టణంలో స్వచ్ఛ దనం--పచ్చదనంలో భాగంగా చెట్లను నాటారు

తెలంగాణ ప్రభ (కోరుట్ల): తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛదనం- పచ్చదనం కార్యక్రమములో భాగంగా మంగళవారం రోజున పట్టణంలోని మంచి నీటి ట్యాంకులను శుభ్ర పరచనైనది, నీటిని సరఫరా చేసిన వార్డుల్లో టెస్టింగ్ కిట్లతో క్లోరినేషన్ స్థాయిని  పరీక్షించడం జరిగినది,బలహీన వర్గాల కాలనిలో సందర్శించి త్రాగునీటి పరిస్థితి తెలుసుకోవడం జరిగినది. పట్టణంలో ఇంకుడు గుంతల నిర్మాణలపై పట్టణ ప్రజలకు అవగాహన కార్యక్రమము నిర్వహించడం, పట్టణంలోని చెరువులను సందర్శించడం జరిగినది, ఇంటింటికీ గులాబీ మొక్కలు పంపిణీ చేయడం జరిగింది మరియు రోడ్డు డివైడర్ల మధ్యలో వున్న 

కొనకార్పస్  చెట్లను తొలగించి, మిర్చి మేరీ గ్రీన్, అశోక, కొబ్బరి , ఈత చెట్లను నాటడం జరిగింది. నీటి నిలువ వున్నచోట దోమల లార్వా నిలువ వుండకుండ గంబుషియ చేపలు, ఆయిల్ బాల్స్ వేయడం జరిగింది. 

ఇట్టి కార్యక్రమములో మున్సిపల్ చైర్ పర్సన్ అన్నం లావణ్య,  వైస్ చైర్ పర్సన్ గడ్డమీది  పవన్, కమిషనర్ బట్టు తిరుపతి, కౌన్సిలర్స్ , కో - ఆప్షన్  సభ్యులు,వార్డ్ ఆఫీసర్లు, మున్సిపల్ సిబ్బంది, R.P లు, మహిళా సంఘ సభ్యులు, ప్రజాప్రతినిధులు వార్డు ప్రజలు పాల్గొన్నారు.

.