సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్

తెలంగాణ ప్రభ (కోరుట్ల): జగిత్యాల జిల్లా కోరుట్ల మండలంలోని వెంకటాపూర్, గుంలాపూర్ మోహన్ రావుపెట్, చిన్న మెట్ పల్లి, మాదాపూర్, పైడిమడుగు, జోగిన్ పల్లి, సర్పరాజ్ పూర్, ధర్మారం, ఐలాపూర్,యూసఫ్ నగర్ గ్రామాల్లో  పది లక్షల అరవై నాలుగు వేల ఐదువందల రూపాయల విలువగల 36 సీఎంఆర్ఏఫ్ చెక్కులను లబ్ధిదారుల ఇంటి ఇంటికి వెళ్లి పంపిణీ చేసిన కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్.

ఈ కార్యక్రమంలో వారితోపాటు బీఆర్ఎస్ మండల అధ్యక్షులు దారిశెట్టి రాజేష్, కేతిరెడ్డి భాస్కర్ రెడ్డి, వనతడుపుల అంజయ్య, మాజీ సర్పంచులు, మాజీ ఎంపిటిసిలు, బీఆర్ఏస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

.