రాష్ట్రస్థాయి కుంగ్ ఫు కరాటే ఛాంపియన్షిప్.

సిరిసిల్లలో పోస్టర్ల ఆవిష్కరణ. 

సిరిసిల్ల. (తెలంగాణ ప్రభ) ఆల్ స్టైల్ కుంగ్ ఫు యూనిట్ ఆఫ్ తెలంగాణ మాస్టర్స్ ఆధ్వర్యంలో కరీంనగర్ లో రాష్ట్రస్థాయి పోటీలు నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర జనరల్ సెక్రెటరీ వడ్నాల శ్రీనివాస్ తెలిపారు. సిరిసిల్లలో మంగళవారం పోటీలకు సంబంధించిన బ్రోచెర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ ఆగస్టు 25న కరీంనగర్లో జరిగే పోటీల కోసం రాష్ట్రంలోని 12 జిల్లాల నుండి పోటీలకు హాజరవుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మాస్టర్ మామిడాల సమ్మయ్య, ఎండి సమీనా, దివ్య, విక్రమ్ గాంధీ, తదితరులు పాల్గొన్నారు.

.