తెలంగాణ ప్రభ (కోటగిరి): కోటగిరి మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఆచార్య జయశంకర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ జయంతి వేడుకల సందర్భంగా ఎంపీడీవో కేఆర్. మనోహర్ రెడ్డి మాట్లాడుతూ.. స్వరాష్ట్ర సాధన కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన మహానీయులు తెలంగాణ సిద్ధార్థ కర్త ప్రొఫెసర్ జయశంకర్ సేవలను స్మరించుకుంటూ ఆయన చిత్ర పటానికి ఘన నివాళులు అర్పించారు. ఆయన తెలంగాణ రాష్ట్ర ఆవశ్యకతను ప్రపంచానికి చాటి చెప్పిన మహోన్నత ఉద్యమ శిఖరం అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి, ఏపీఓ గంగాధర్ ఎంపీడీవో కార్యాలయ సిబ్బంది, ఈజీఎస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
