తెలంగాణ ప్రభ (కోరుట్ల): ఇటీవలే అండర్ 12 రన్నింగ్ పోటీల్లో జిల్లా స్థాయిలో ప్రథమ శ్రేణిలో గెలుపొంది, రాష్ట్రస్థాయి క్రీడల్లో రాణించిన శుభ సందర్భాన్ని పురస్కరించుకొని తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో హర్షవర్ధన్ రాజుకు ఘన సన్మానం చేసి అభినందించారు.
ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షులు రాంజీ నాయక్ విద్యుత్ శాఖ కార్యాలయంలో మాట్లాడుతూ హర్షవర్ధన్ లాంటి క్రీడాకారులు నేటి సమాజానికి అత్యవసరమని, ఇలాంటి అరుదైన క్రీడాకారులను ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు దత్తత తీసుకొని ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని, రాబోయే రోజుల్లో పల్లెలో పుట్టిన పగడాలను, మట్టిలో మాణిక్యాలను వెలికి తీసి వారికి అవకాశాలు కల్పించి, ఒలంపిక్స్ కి వెళ్లేటట్టుగా శిక్షణను ఇచ్చినట్లయితే బాగుంటుందని ఆయన పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మెటుపల్లి డివిజన్ 327 అధ్యక్షులు వేణుగోపాల్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి హరి ప్రసాద్, స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ నూనె లక్ష్మణ్, వర్కింగ్ ప్రెసిడెంట్ శంకరయ్య, వెంకటేశ్వర్లు, శ్రీనివాస్, విష్ణువర్ధన్, ఫ్రాంక్లిన్ రాజు, లక్ష్మణ్, రవి, ప్రశాంత్, జలపతి, నరహరి, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
.