కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ కి వినతి పత్రం అందజేసిన శాలివాహన జగిత్యాల జిల్లా కుమ్మరి సంఘం నాయకులు

తెలంగాణ ప్రభ (కోరుట్ల): జగిత్యాల జిల్లా మెటుపల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జగిత్యాల జిల్లా వివిధ మండలాలకు చెందిన కుమ్మరి సంఘం అధ్యక్షులు. కుమ్మరి సంఘం జగిత్యాల జిల్లా ఆధ్వర్యంలో గత 10 రోజుల క్రితం పెద్దాపూర్ క్యాంపు గురుకుల పాఠశాలలో ఎనిమిదవ తరగతి విద్యార్థి గుణాధిత్య 25 జులై 2024 రోజు ఉదయం 3 గంటల సమయంలో పాముకాటుకు గురి కాగా, గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ నిర్లక్ష్యం కారణంగా మృతి చెందిన విషయం విధితమే. 

మృతి చెందిన విద్యార్థి కుటుంబానికి ప్రభుత్వం 50 లక్షల రూపాయలు నష్టపరిహారం ఇప్పించాలని, అలాగే కుటుంబంలో సభ్యునికి ప్రభుత్వ ఉద్యోగం ఇప్పించేలా చర్యలు తీసుకోవాలని జగిత్యాల జిల్లా కుమ్మరి సంఘం అధ్యక్షులు, వివిధ మండలాల అధ్యక్షులు ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ ని కోరారు. 

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ మాట్లాడుతూ మంచి భవిష్యత్తు కలిగిన విద్యార్థి పాము కాటు వల్ల మృతి చెందడం చాలా విచారకరమని అన్నారు చనిపోయిన విద్యార్థి కుటుంబానికి న్యాయం జరిగేలా చూస్తానని ఆయన హామీ ఇచ్చారు.

.