తెలంగాణ ప్రభ (కోరుట్ల): గత నాలుగు సంవత్సరాల క్రితం మతిస్థిమితం కోల్పోయి తప్పిపోయి తిరిగి సొంత ఇంటికి వచ్చిన కోరుట్ల పట్టణానికి చెందిన కటుకం రమేష్ కు చేదోడుగా 1998-99 సంవత్సర పదవ తరగతి విద్యార్థులు, బాల్య మిత్రులు నెలకు సరిపడా నిత్యవసర వస్తువులు, 35 వేల రూపాయల నగదును కాంగ్రెస్ నాయకులు అన్నం అనిల్, 32,వ వార్థు కౌన్సిలర్ జిందం లక్ష్మీనారాయణల సమక్షంలో మంగళవారం రోజున రమేష్ తల్లిదండ్రులకు అందజేశారు.
ఈ సందర్భంగా స్నేహితులు చేసిన సహాయానికి రమేష్ తల్లిదండ్రులు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.
.