ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి

పచ్చదనం స్వచ్ఛదనం గొప్ప కార్యక్రమం...

13వ వార్డు కౌన్సిలర్ తిరుమల వసంత గంగాధర్

తెలంగాణ ప్రభ (కోరుట్ల): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛతనం పచ్చదనం కార్యక్రమం చాలా గొప్ప కార్యక్రమమని ఇట్టి విషయాన్ని ప్రజలు గమనించాలని మన ఇంటిని మనమే శుభ్రంగా ఉంచుకోవడంతో పాటు ఇంటి పరిసరాలలో అశుభ్రమైన వస్తువులలో నీరు ఉన్న తొలగించి, ఇంటి పరిసరాలలో చెత్తాచెదారం లేకుండా తొలగించి, ప్రతి ఒక్కరూ వారి ఇంటిని స్వచ్ఛతనం పచ్చదనం కార్యక్రమంలో పాల్గొని దోమల బెడద లేకుండా చేయాలని దోమల ద్వారా డెంగ్యూ, మలేరియా వంటి విషపూరితమైన జ్వరాలు వస్తాయని, అలాంటివి రాకుండా ఉండాలంటే మన ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకొని స్వచ్ఛతనం పచ్చదనం కార్యక్రమంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని కోరారు. 

ఈ కార్యక్రమంలో 13వ వార్డు కౌన్సిలర్ తిరుమల వసంత గంగాధర్ తో పాటు వార్డు ఇంచార్జ్ జగ్గల రమేష్, ఆర్ పి వనిత, అంగన్వాడీ టీచర్ హిమగిరి, ఆశా వర్కర్ అన్నపూర్ణ, నాయకులు మ్యాకల నర్సయ్య, అశోక్ వార్డు ప్రజలు మహిళలు తదితరులు పాల్గొన్నారు.

.