పెద్దాపూర్ గురుకుల పాఠశాలను సందర్శించిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్

తెలంగాణ ప్రభ (కోరుట్ల): మెటుపల్లి మండలం పెద్దాపూర్ గ్రామంలోని గురుకుల పాఠశాలను కోరుట్ల ఎమ్మెల్యే డా.కల్వకుంట్ల సంజయ్ ఈరోజు సందర్శించారు. ఇటీవలె పాఠశాలలో జరిగిన ఘటనపై సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.

ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ విద్యార్థులతో మాట్లాడుతూ పాఠశాలలో ఏవైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని  ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటానని విద్యార్థులకు తెలిపారు.

వారితోపాటు నాయకులు దారిశెట్టి రాజేష్, మారుసాయిరెడ్డి, కోరేపు రవి,బీఆర్ఏస్ నాయకులు తదితరులున్నారు.

.