కోరుట్లలో స్వచ్ఛ దనం -- పచ్చదనం కార్యక్రమం

తెలంగాణ ప్రభ (కోరుట్ల): తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛదనం- పచ్చదనం కార్యక్రమాన్ని జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో సోమవారం రోజున  ప్రారంభించిన కోరుట్ల మున్సిపల్ చైర్ పర్సన్ అన్నం లావణ్య  మరియు వైస్ చైర్ పర్సన్ గడ్డమీది  పవన్ , కమిషనర్ బట్టు తిరుపతి . అనంతరం అన్ని వార్డుల యందు స్వచ్ఛదనం - పచ్చదనం కార్యక్రమాన్ని కౌన్సిలర్లు మరియు కోఆప్షన్ సభ్యులు తమ తమ వార్డులలో ప్రారంభోత్సవం 

చేశారు. 

అనంతరం ప్లాస్టిక్ నిషేధం మరియు తడి పొడి చెత్తను ఇంటి వద్దనే వేరుచేసి (సోర్స్ లెవెల్ సెగ్రిగేషన్) డెంగ్యూ, మలేరియా, దోమల నివారణ, కుక్కల బెడద పై  అవగాహన ర్యాలీ నిర్వహించడం జరిగింది, 


అలాగే పారిశుధ్యం, వ్యక్తిగత పరిశుభ్రత , సిజినల్ వ్యాదుల పట్ల, ప్లాస్టిక్ వాడడం వల్ల కలిగే నష్టాలపై  స్కూల్ పిల్లలతో  వ్యాసరచన పోటీలు నిర్వహించారు. 

అన్ని ప్రభుత్వ సంస్థలు, హాస్పిటల్ ,స్కూల్స్, హాస్టల్స్ , బస్టాండ్, అంగన్వాడీ కేంద్రాల ఆవరణలో పరిసరాలు శుభ్ర పరిచారు. 

ఇట్టి కార్యక్రమంలో వార్డ్ ఆఫీసర్లు, మున్సిపల్ సిబ్బంది, ఆర్ పి లు, మహిళా సంఘ సభ్యులు, ప్రజాప్రతినిధులు వార్డు ప్రజలు పాల్గొన్నారు.

.