కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గం ఇంచార్జ్ కేకే మహేందర్ రెడ్డి.
సిరిసిల్ల ప్రజల నమ్మకం కోల్పోయిన కేటీఆర్.
తెలంగాణ ప్రభ (సిరిసిల్ల ) : సిరిసిల్ల వస్త్ర పరిశ్రమలో సమస్యలను శాశ్వతంగా పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నామని కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గ ఇంచార్జ్ కేకే మహేందర్ రెడ్డి అన్నారు. సోమవారం ఏర్పాటు చేసిన సమావేశంలో కేకే మహేందర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమం చేసి ప్రజలకు న్యాయం చేస్తామని గెలిచి ప్రజలకు చేసిందేమిటని బిఆర్ఎస్ నుంచి ఉద్దేశించి సూటిగా ప్రశ్నించారు. బతుకమ్మ చీరల ఆర్డర్ తో ఆదుకుంటామని బజారు పాలు చేశారని కేటీఆర్ ను ఉద్దేశించి అన్నారు. కాటన్ పాలిస్టర్ డైయింగ్ వ్యవస్థలు పూర్తిగా బ్రష్టు పట్టిపోయాయని అన్నారు. స్పిన్నింగ్ మిల్ నడిపిస్తే 1200 మంది మహిళలకు ఉపాధి అవకాశాలు ఉండేవని రియల్ ఎస్టేట్ గా మార్చి అమ్ముకున్నారని ఆరోపించారు. బతుకమ్మ చీరలపై కుంభకోణం జరిగిందని అప్పట్లోనే ఆరోపణలు చేశామని అన్నారు. సిరిసిల్ల పట్ల కేటీఆర్ కు చిత్తశుద్ధి లేదని ఇక్కడ ప్రజలపై నమ్మకం ఉంటే మెగా టెక్స్టైల్ పార్క్ వరంగల్ కు ఎందుకు పోయిందని ప్రశ్నించారు. నేత కార్మికులు 14 రోజులు దీక్షలు చేస్తే ఒక్కరోజైన దీక్ష లో కూడా కూర్చోకపోవడం పై మండిపడ్డారు. ఇక్కడ ప్రజల దయతో గెలిచిన కేటీఆర్ సిరిసిల్ల ప్రాంతం సమస్యలు పరిష్కరించబడును దారుణమని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ ప్రజలపై ఉన్న ప్రేమతో వంద కోట్ల బతుకమ్మ చీరల బకాయిలు విడుదల చేయడంతో పాటు 10 హెచ్పి ల వరకు 50 శాతం విద్యుత్ సబ్సిడీ ఇస్తున్నామని తెలిపారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ నాయకులు నాగుల సత్యనారాయణ, గడ్డం నర్సయ్య, గోనె ఎల్లప్ప,ఏల్లె లక్ష్మీనారాయణ, భీమారపు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు
.