తెలంగాణ ప్రభ (కుత్బుల్లాపూర్) దూలపల్లి లోని సెంట్ మార్టిన్స్ కళాశాలలో నిర్వహించిన నేషనల్ మాస్టర్స్ అథ్లెటిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన జాతీయస్థాయి అథ్లెటిక్స్ సన్మాన కార్యక్రమానికి ఎమ్మెల్యే కె.పి వివేకానంద్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కె.పి వివేకానంద మాట్లాడుతూ జాతీయస్థాయిలో అథ్లెటిక్స్ లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారిని ఇలా సన్మానిస్తూ కార్యక్రమం నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని, అథ్లెటిక్లో యువకులను ప్రోత్సహించేందుకు నేషనల్ మాస్టర్స్ అథ్లెటిక్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మర్రి లక్ష్మణ్ రెడ్డి చేస్తున్న కృషి ఎంతో స్ఫూర్తిదాయకమన్నారు. అనంతరం అథ్లెటిక్స్ లో జాతీయస్థాయిలో మొదటి, ద్వితీయ, తృతీయ స్థానాలలో నిలిచిన 150 మంది అథ్లెటిక్స్ కు నగదు ప్రోత్సాహకం అందించి ఘనంగా సత్కరించారు.
ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి ప్రభు కుమార్, కోశాధికారి డి.లక్ష్మి తదితరులు పాల్గొన్నారు
.