పలు సమస్యలపై వినతి పత్రం

అధికారులతో మాట్లాడి సమస్యలను పరిష్కరించేలా కృషి చేస్తానని హామీ ఇచ్చిన మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్

తెలంగాణ ప్రభ (కుత్బుల్లాపూర్) పదేండ్ల బీఆర్ఎస్ పార్టీ పాలనలో బాధితులైన ప్రతి ఒక్కరికి కాంగ్రెస్ ప్రభుత్వం న్యాయం చేస్తుందని మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్  అన్నారు. షాపూర్ నగర్ లోని తన నివాసం వద్ద ప్రజలు, కార్యకర్తల నుండి మాజీ ఎమ్మెల్యే శ్రీశైలం గౌడ్ వినతులు స్వీకరించారు. తమ సమస్యలు చెప్పుకునేందుకు వివిధ బస్తీల నుండి ప్రజలు, భాదితులు శ్రీశైలం గౌడ్ నివాసానికి వచ్చారు. అందరి సమస్యలు పరిష్కరిస్తానని మాజీ ఎమ్మెల్యే వారికి భరోసా ఇచ్చారు. బహదూర్ పల్లి, గుబురుగుట్ట కాలనీల నుండి ఆయా సంక్షేమ సంఘాల ప్రతినిధులు తమ కాలనీల్లో నెలకొన్న సమస్యలు మాజీ ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా, సంబంధిత అదికారులతో మాట్లాడి సమస్యల  పరిష్కారానికి కృషి చేస్తానని ఆయన తెలిపారు.  పలువురు పలు ఆహ్వాన పత్రికలు అందజేశారు.

.