సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ సమస్యల పరిష్కారానికి కృషి... ఆది శ్రీనివాస్, ప్రభుత్వ విప్.

సమస్యల పరిష్కారంపై రాష్ట్ర ప్రభుత్వం సానుకులం.

తెలంగాణ ప్రభ (సిరిసిల్ల): సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారు. 

జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, హ్యాండ్లూమ్ అండ్ టెక్స్ టైల్స్, సెస్ చైర్మన్, అధికారులు, పవర్ లూమ్ యజమానులు, ఆసాములతో ఆదివారం సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పవర్ సబ్సిడీ, కోర్టులో కేసు, ఎస్ ఎస్ ఐ యూనిట్ల అంశాలపై చర్చించారు. అనంతరం ప్రభుత్వ విప్ మాట్లాడారు. 

సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ సమస్యల పరిష్కారం పై రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా ఉందని, సమస్యల పరిష్కారానికి సర్కార్ కట్టుబడి ఉందని ఆ దిశగా ముందుకెళ్తుందని స్పష్టం చేశారు.

ఇప్పటికే పలుమార్లు బతుకమ్మ చీరల బకాయిలు విడుదల చేసిందని గుర్తు చేశారు. అలాగే  స్కూల్ యూనిఫాం క్లాత్ ఆర్డర్ ను కూడా అందజేసిందని వివరించారు. కోర్టు పరిధిలో ఉన్న అంశాలు మినహా అన్ని సమస్యలు పరిష్కరిష్కారానికి కృషి చేస్తానని భరోసా కల్పించారు. ఇప్పటికే ఇదే విషయమై పలుమార్లు చర్చించామని ముఖ్యమంత్రి, మంత్రితో చర్చించామని గుర్తు చేశారు. ఇతర రాష్ట్రాల్లో పవర్ లూమ్ పరిశ్రమకు అందిస్తున్న రాయితీలు ప్రోత్సాహకాలపై ప్రభుత్వానికి నివేదిస్తామని భరోసా కల్పించారు. ఇదే విషయమై మరో సారి చర్చిస్తామని విప్ ప్రకటించారు.

పవర్ లూమ్ పరిశ్రమలో విద్యుత్ సబ్సిడీ సమస్య పరిష్కరిస్తామని సెస్ చైర్మన్ చిక్కాల రామారావు హామీ ఇచ్చారు. 

ఇక్కడ అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్, హ్యాండ్లూమ్ అండ్ టెక్స్ టైల్ శాఖ ఏడీ సాగర్, పవర్ లూమ్ యజమానులు, ఆసాములు తదితరులు పాల్గొన్నారు.

.