పర్ష హనుమండ్లు, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి.
తెలంగాణ ప్రభ (సిరిసిల్ల.) జనాభా ప్రాతిపదికన బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిది పర్శ హనుమండ్లు అన్నారు. ఆదివారం సిరిసిల్లలో నిర్వహించిన సమావేశంలో ఓబీసీ సంక్షేమ సంఘం అఖిలభారత మహాసభల పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా హనుమండ్లు మాట్లాడుతూ తంజావూరులో ఆగస్టు 7న అఖిలభారత మహాసభలు నిర్వహించినున్నట్లు తెలిపారు. భవిష్యత్ కార్యాచరణ పై మహాసభల్లో చర్చ ఉంటుందని అన్నారు. మహాసభలను విజయవంతం చేయాల్సిందిగా కోరారు. సమావేశంల బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు వీరవేని మల్లేశం యాదవ్. కంచర్ల రవి గౌడ్. తాడుక కమలాకర్ .రామా గౌడ్. కోడం రవీందర్. కొండ విజయ్. తిరుపతి. శ్రీనివాస్. బచ్చు ప్రసాద్. శ్రీధర్. వడ్ల తిరుపతి. తదితరులు పాల్గొన్నారు
.