సిరిసిల్ల. (తెలంగాణ ప్రభ). సాహితి వేత్త, ప్రముఖ రచయిత జూకంటి జగన్నాథం కు నాగుల మల్లయ్య స్మారక పురస్కారం వరించింది. ఆదివారం సిరిసిల్లలో నిర్వహించిన నాగుల మల్లయ్య స్మారక పురస్కారాన్ని ప్రభుత్వం విప్ ఆది శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్చార్జ్ కేకే మహేందర్ రెడ్డి పురస్కార కమిటీ నిర్వాహకుల చేతుల మీదుగా జూకంటి పురస్కారం అందుకున్నారు. కార్యక్రమంలో సిరిసిల్ల మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళ, సంగీతం శ్రీనివాస్, గడ్డం నరసయ్య, నాగుల సత్యనారాయణ గౌడ్, ఎండి సలీం, నాగుల సంతోష్ తదితరులు పాల్గొన్నారు.
