తెలంగాణ ప్రభ (కోరుట్ల): తెలంగాణ అల్ సీనియర్ సిటీజేన్స్ అసోసియేషన్ జిల్లా శాఖ జిల్లా కార్యాలయంలో ఆదివారం స్నేహితుల దినోత్సవం నిర్వహించారు.
పలువురు స్నేహితులను సీనియర్ సిటీజేన్స్ రాష్ట్ర కార్యదర్శి హరి ఆశోక్ కుమార్ ఆధ్వర్యంలో ఘనంగా కిరీటధారణతో సన్మానించి,మెమోంటోలు,కానుకలు అందజేశారు.
ఈ సందర్భంగా హరి ఆశోక్ కుమార్ మాట్లాడుతూ స్నేహానికి కుల మతాలు లేవని, స్నేహబంధం గొప్పదని,బాల్యం నుంచి వృద్దాప్యం వరకు కష్టసుఖాల్లో తోడుగా అందరిలో స్నేహాభావం ఉంటుందన్నారు.
మన కుటుంబం తాతలు,తాతమ్మలు,నానమ్మలు,అమ్మమ్మలు,తల్లిదండ్రులు,తోబుట్టువులను ఇస్తుందని,ఒక్క మిత్రులను ఎంపిక చేసుకునే అవకాశం మాత్రమే మనకు ఉంటుందన్నారు.
వారు మంచి వారా,చెడ్డ వారా అనే దానిపై మన ప్రవర్తన, పయనం ఆధారపడి ఉంటాయని,స్నేహం పవిత్రమైనదిగా ఉండాలని,అటువంటి స్నేహమే మన జీవితాంతం నిలుస్తోందని ఆయన వివరించారు.
ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ జీ.ఆర్.దేశాయ్, కౌన్సిలింగ్ అధికారి పి.సి.హన్మంత్ రెడ్డి, సీనియర్ సిటిజెన్ల జిల్లా కార్యదర్శిగౌరిశెట్టి విశ్వనాథం,కోశాధికారి వెల్ముల ప్రకాష్ రావు, ఉపాధ్యక్షులు బొల్లం విజయ్, ఎం.డి.యాకూబ్, నాయకులు సింగం గంగాధర్,దిండిగాల విఠల్,నారాయణ,దేవేందర్ రావు,బి.రాజేశ్వర్,సయ్యద్ యూసుఫ్,ఎం.డి.ఎక్బాల్,బెంజమిన్, కండ్లే గంగాదర్,కే.సత్యనారాయణ,పబ్బా శివానందం,రాజ్ మోహన్,జిల్లా,డివిజన్,మండలాల సీనియర్ సిటీజేన్స్,పెన్షనర్ల ,వివిధ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
.