ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే.. కూనంవేని సాంబశివరావు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి,

కూనంవేని సాంబశివరావు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, 

జేఏసీ దీక్షలకు మద్దతు. 

రాజన్న సిరిసిల్ల బ్యూరో (తెలంగాణ ప్రభ). సిరిసిల్ల వస్త్ర పరిశ్రమను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి శాసనసభ్యులు కూనంవేని సాంబశివరావు అన్నారు. ఆదివారం అంబేద్కర్ చౌరస్తాలో వస్త్ర పరిశ్రమ జేఏసీ ఆధ్వర్యంలో జరుగుతున్న దీక్ష శిబిరాన్ని  సందర్శించి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిరిసిల్ల లో చేనేత వృత్తిదారుల పరిస్థితులు దయనీయంగా ఉన్నాయని అన్నారు. సమస్యల్లో కూరుకుపోయిన వస్త్ర పరిశ్రమ కాపాడవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని అన్నారు. వేల కుటుంబాలు మర నేత వృత్తి జీవనాధారంగా ఉందని అన్నారు. సిరిసిల్ల పరిశ్రమ విషయంలో అసెంబ్లీలో కూడా ప్రస్తావించడం జరిగిందని తెలిపారు. మినిమం వేజ్ చట్టం ద్వారా కల్పించిన భద్రత విషయం ఇక్కడ ఆచరణకు నోచని పరిస్థితులు కనిపిస్తున్నాయని అన్నారు. వస్త్ర పరిశ్రమ జేఏసీ అడుగుతున్న న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పరిశీలించవలసిందిగా కోరారు. ఉపాధి, విద్యుత్ సబ్సిడీ అంశాలను పట్టించుకోని పరిశ్రమను కాపాడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా సిరిసిల్ల వస్త్ర పరిశ్రమను ఆధునికతవైపు నడిపించాల్సిందిగా కోరారు. దీక్షలో వస్త్ర పరిశ్రమ జేఏసీ నాయకులు పాల్గొన్నారు. కార్యక్రమంలో సిపిఐ పట్టణ కార్యదర్శి పంతం రవి, కడారి రాములు, సిపిఎం నాయకులు రమేష్, గణేష్ పలువురు వస్త్ర పరిశ్రమ జేఏసీ తాటిపాముల దామోదర్, మండల సత్యం, ఎనుగుల ఎల్లయ్య నాయకులు పాల్గొన్నారు.

.