తెలంగాణ ప్రభ (కుత్బుల్లాపూర్) షాపూర్ నగర్, గాజులరామారం లోని శ్రీ చైతన్య సాగర్ భవన నిర్మాణ కార్మిక సంఘం నూతన కమిటీ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. భవన నిర్మాణ కార్మిక కమిటీలో ఎన్నో రోజుల నుంచి కార్మికుల పట్ల అండగా ఉంటూ కార్మికులకు ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడికి వెళ్లి న్యాయం చేసిన బిఆర్ టియు రాష్ట్ర కార్మిక నాయకుడు రవి సింగ్ ను ఏకగ్రీవంగా శ్రీ చైతన్య సాగర్ భవన నిర్మాణ కార్మిక సంఘం అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సూరారం డివిజన్ కార్పొరేటర్ మంత్రి సత్యనారాయణ, ఈ కమిటీలో ఉప అధ్యక్షునిగా ఏం విట్టల్, రాజు సాగర్, ప్రధాన కార్యదర్శి సహదేవ్, అఖిల్ షేక్, కోశాధికారి బాబూజీ, తలారి దుర్గయ్య, నాగరాజు, డేవిడ్ రాజు, ఆర్గనైజర్ గా స్వామి, రమేష్ సాగర్, మాణిక్యం, నరసింహ, దాస్, అడ్వైజర్స్ పాండు సాగర్ ఎం.శ్రీను, ఎస్.శ్రీను,కమిటీ సభ్యులు పరశురాం, ఎం.రఫీ, రాము, లంబాడి రమేష్, రవి నూతన కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది.ఈ కార్యక్రమం తర్వాత జెండా ఆవిష్కరణ కమిటీ సభ్యులతో మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో అనిల్, సుదర్శన్, జగన్, కిరణ్, శ్రీ చైతన్య సాగర్ భవన నిర్మాణ కార్మిక కమిటీ సభ్యులు స్థానిక కార్మికలు తదితరులు పాల్గొన్నారు.
