వృద్ధుల ఫిర్యాదులపై విచారణలు

తెలంగాణ ప్రభ (కోరుట్ల): తమను నిరాదరిస్తున్న  కుమారులపై వయోవృద్ధుల సంరక్షణ చట్టం కింద చర్యలు తీసుకోవాలని జగిత్యాల ఆర్డీవో మధుసూదన్ కు వివిధ గ్రామాల వృద్ధులు ఫిర్యాదులు చేశారు. 

ఈ మేరకు ఆర్డీవో అదేశాల మేరకు శనివారం ఆర్డీవో కార్యాలయంలో ఏ.ఓ.తఫజుల్ హుస్సేన్ విచారణలు నిర్వహించారు.

జగిత్యాల  మండలం గోవింద్ పల్లేకు చెందిన ముల్లె నారాయణ ,జగిత్యాల పట్టణముకు చెందిన బొక్కు సత్యనారాయణ,వివిధ గ్రామాల  ఫిర్యాదు దారుల కుమారులను,కూతుర్లను,కొడళ్లను,అల్లుళ్ళను ,విచారించారు.  

తెలంగాణ అల్ సీనియర్ సిటీజేన్స్  అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు  హరి ఆశోక్ కుమార్ విచారణకు ముందుగా వృద్ధులైన తల్లిదండ్రులను పోషించకుండా, నిర్లక్ష్యం చేస్తున్న వారి కుమారులకు,కోడళ్లకు,కూతుర్లకు,అల్లుళ్ళకు   2007 సంరక్షణ చట్టం,నియమావళి 2011 , సెక్షన్ 24 పై కౌన్సిలింగ్ చేశారు.

జగిత్యాల మండలం ధర్మారం గ్రామానికి చెందిన దండిగే లక్ష్మీ అనే వృద్ధ తల్లిని,తండ్రి బాలమల్లు ను పోషించకుండా కొడుతూ,చంపుతానని, బెదిరింపులకి గురిచేస్తున్న వారి పెద్ద కొడుకుపై జగిత్యాల రూరల్ పోలీసు స్టేషన్లో సెక్షన్ 24 ప్రకారము ఎఫ్.ఐ.ఆర్.నెంబర్.340/2024 తేదీ.29-7-2024 ద్వారా క్రిమినల్ కేసు నమోదు అయిందని,అలాగే కోరుట్ల డివిజన్ లో ఒక కుమారునికి 3 మాసాల జైలు శిక్షకు అక్కడి ఆర్డీవో విధించిన విషయాన్ని వివరిస్తూ కౌన్సెలింగ్ నిర్వహించారు.

ఈ విచారణలో సీనియర్ సిటిజెన్స్ కమిటీ జిల్లా అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్,ఎఫ్.ఆర్.ఓ.కొండయ్య ,సెక్షన్  సహాయకులు నర్మద, కౌన్సెలింగ్ అధికారి పి.హన్మంత్ రెడ్డి,తదితరులున్నారు.

.