ఇంటి నుండి అన్నం టిఫిన్ లు తీసుకెళ్తున్న విద్యార్థులు
తెలంగాణ ప్రభ (కోటగిరి): కోటగిరి మండలం కొత్తపల్లి గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజనం రుచిగా లేకపోవడంతో విద్యార్థులు తినడం లేదనీ గ్రామస్తులు తెలిపారు. ఇంటి నుండి భోజనం బాక్స్ లు తీసుకు వెళ్తున్నరని విద్యార్థుల తల్లిదండ్రులు అంటున్నారు. స్కూల్లో భోజనాలు రుచికరంగా లేకపోవడం ఉడకని అన్నం , కూరలు రుచిగా లేకపోవడంతో తినడానికి విద్యార్థులు భయపడుతున్నారు. ఉడకని కూరల వల్ల తినలేక పోడి కారం తో భోజనం చేస్తున్నరని విద్యార్థుల తల్లిదండ్రులు వాపోతున్నారు. ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు ఎన్నిసార్లు మధ్యాహ్నా భోజనం వడ్డించే కార్మికులకు విద్యాశాఖ అధికారులకు, ప్రజా ప్రతినిధుల చెప్పినప్పటికి పట్టించుకోవడం లేదన్నారు. పాఠశాల మాజీ చైర్మన్ పుప్పల దత్తాత్రి శనివారం పాఠశాల సందర్శించి మధ్యాహ్న భోజనాలు పరిశీలించారు. భోజనాలు బాగుండక పోవడంతో ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానన్నారు.
కోటగిరి ఎంఈఓ వివరణ.. పాఠశాలను సోమవారం,మంగళవారం సందర్శించి మధ్యాహ్న భోజనాన్ని పరిశీలిస్తామని ఆపై మధ్యాహ్న భోజన కార్మికులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.
