తెలంగాణ ప్రభ (కోరుట్ల): తల్లిపాలు పిల్లలకు ఇస్తే శారీరక ఆరోగ్యం, మానసిక వికాసం చెందుతారని జగిత్యాల ఐసీడీఎస్ పీడీ డాక్టర్ బి.నరేష్ అన్నారు. ప్రపంచ తల్లిపాల వారోత్సవాలలో భాగంగా శనివారం సినారే కళాభవన్ లో తల్లిపాల వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ తల్లిపాలు పిల్లలకు ఇవ్వడం వల్ల చురుగ్గా మానసికంగా, శారీరకంగా దృఢంగా ఉండటం, తల్లీబిడ్డల్లో ప్రేమానురాగాలు, జ్ఞాపకశక్తి పెరుగుతుందన్నారు. తల్లిపాలు బిడ్డకు ఇస్తే తల్లికి, బిడ్డకు కలిగే లాభాలు, ఆరు నెలలు నిండిన పిల్లలకు అదనపు ఆహారం అందిస్తే లాభాలు, ఇవ్వకపోతే కలిగే నష్టాలు ఐసీడీఎస్ పీడీ డాక్టర్ బి.నరేష్ వివరించారు. డాక్టర్ స్వీతి మాట్లాడుతూ తల్లిపాలు బిడ్డకు ఇవ్వడం వల్ల తల్లికి, బిడ్డకి బాండింగ్ పెరుగుతుందన్నారు. పిల్లలకు ఇమ్యూనిటీ పవర్ ఐక్యూ తల్లిపాల నుండే లభిస్తాయి. పుట్టిన వెంటనే ముర్రిపాలు ఇవ్వాలన్నారు. ఆరు నెలలు నిండిన పిల్లలకు అన్నప్రాసనలు, గర్భిణీలకు శ్రీమంతాలు చేశారు.
ఈ కార్యక్రమంలో జోన్ చైర్మన్ ఆడెపు కమల, ప్రెసిడెంట్ పోతని శ్రీలత, సెక్రెటరీ పొలాస గీతా, పిజెడ్ సి అల్లాడి శోభ, పోస్ట్ ప్రెసిడెంట్ వనపర్తి రమ్య, ఐసిడిఎస్ సిడిపిఓ కె. మనమ్మ, సూపర్ వైజర్ కె. హేమలత, అంగన్వాడీ టీచర్లు, ఆశాలు, ఏఎన్ఎంలు పాల్గొన్నారు.
.