తెలంగాణ ప్రభ (కోరుట్ల): జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కాలనీ ప్రాంతానికి చెందిన ఉయ్యాల సుకుమార్ జయంతి వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా పట్టణంలోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ నగర్ లోని ప్రభుత్వ ఉన్నత ప్రాథమిక పాఠశాలలో సుమారు 150 మంది విద్యార్థిని, విద్యార్థులకు పలకలు, బలపాలు, నోట్ బుక్స్ ,పెన్నులను పంపిణీ చేశారు.
అదేవిధంగా విద్యార్థిని, విద్యార్థులకు, ఉపాధ్యాయులకు పండ్లను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎంఈఓ, కౌన్సిలర్లు మాట్లాడుతూ సుకుమార్ విద్యార్థి దశలో చురుకుగా ఉండేవాడని అన్నారు.
వ్యాపారంలో రాణిస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు మరణించడం చాలా బాధాకరమని తెలిపారు. చిన్నతనం నుండి సుకుమార్ అనేక సేవా కార్యక్రమాలు చేశాడని గుర్తు చేశారు.
సుకుమార్ జయంతి, వర్ధంతి ల సందర్భంగా ఇలాంటి కార్యక్రమాలు చేయడం పేద విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు.
ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి గంగుల నరేష్o, సుకుమార్ తండ్రి ,విశ్రాంతి ప్రధానోపాధ్యాయుడు ఉయ్యాల నరసయ్య, కౌన్సిలర్లు షాబీర్, బలిజ పద్మా రాజారెడ్డి, మోర్తాడు లక్ష్మీనారాయణ, బద్ది సుజాత మురళీధర్, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మధుసూదన్ రావు , డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సంఘ నాయకులు పసుల కృష్ణ ప్రసాద్, ఉయ్యాల శోభన్, సురేందర్, గిన్నెల శ్రీకాంత్, సామల్ల వేణుగోపాల్, ఉయ్యాల శేఖర్, బొల్లె గంగాధర్, ఉపాధ్యాయులు, విద్యార్థిని, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు...
అలాగే సుమన్ యూత్ ముత్యoపేట గ్రామంలో ఉయ్యాల సుకుమార్ మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి సుమారు 60 మంది వరకు రక్తధానం చేశారు
ట్రస్ట్ సభ్యులు మాట్లాడుతూ సుకుమార్ ఉన్న సమయంలో సుమారు 22 సార్లు రక్తదానం చేయడం జరిగింది.
దాన్ని దృష్టిలో పెట్టుకొని రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది.
ఇట్టి కార్యక్రమం లో గోడిసేలా సృజన్, బొల్లెo రాజు, బొల్లెo రఘ, చింతల రాజశేఖర్, గౌడే ఆదర్శ్,తిప్పిరిఅశోక్, రమేష్, రాజేష్,ప్రవీణ్,శ్రీహరి, నరహరి, సందీప్, సుమారు వంద మంది పైగా పాల్గొన్నారు.
.