తెలంగాణ ప్రభ (కోరుట్ల): మెటుపల్లి పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, మందకృష్ణ మాదిగ కు పాలాభిషేకం చేశారు.
గత 30 సంవత్సరాలుగా మాదిగలు మరియు మాదిగ ఉపకులాలు ఎస్సీ వర్గీకరణ కోసం మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో అలుపెరుగని పోరాటం ఫలితంగా సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ చేసుకోవడానికి రాష్ట్రాలకు పూర్తి అధికారాన్ని ఇవ్వడం జరిగింది.
దానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా అవసరమైతే ప్రస్తుతం ఇచ్చిన ఉద్యోగాల్లో కూడా ఎస్సీ వర్గీకరణ అమలు చేసి, మాదిగ మరియు మాదిగ ఉపకులాలకు అవసరమైన రిజర్వేషన్లు కల్పిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు.
ఈ నిర్ణయం పట్ల రాష్ట్రంలో ఉన్న మాదిగలు, మరియు మాదిగ ఉప కులాలు హర్షం వ్యక్తం చేశాయి.
ఈ కార్యక్రమంలో మెటుపల్లి పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జెట్టి లింగం, కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ నాయకులు ఉల్లెందులరమేష్, బర్ల సూరి, సుంకే ప్రసాద్, రమేష్, తాండ్ర నర్సయ్య, రాకేష్ మరియు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కౌన్సిలర్ యమ రాజయ్య, రాజగోపాల్, లక్ష్మారెడ్డి ట్రస్ట్ చైర్మన్ సంతోష్ రెడ్డి, చరణ్ సింగ్, ఆడెపు రమణ, సంజీవ్, సంతోష్, దినేష్, షకీల్, తడగొండ శివ మరియు తదితరులు పాల్గొన్నారు.
.