565 గ్రా గంజాయి 01 మోటార్ సైకిల్ 01 సెల్ ఫోన్ ను స్వాధీనం...
విలేకరుల సమావేశంలో ----విలేకరుల సమావేశంలో మెటుపల్లి డిఎస్పి ఉమా మహేశ్వర రావు
తెలంగాణ ప్రభ (కోరుట్ల): జగిత్యాల జిల్లాలోని మేడిపల్లి మండలం కొండాపూర్ గ్రామ శివారులో గంజాయి విక్రతను అరెస్టు చేసి రిమాండ్ కు పంపినట్లు మెట్ పల్లి డీఎస్పీ ఉమామహేశ్వరరావు
తెలిపారు.
శుక్రవారం మేడిపల్లి పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మెట్ పల్లి డీఎస్పీ ఈ కేసు వివరాలు వెల్లడించారు.
ఈ సందర్భంగా డిఎస్పీ మాట్లాడుతూ గురువారం మేడిపల్లి మండలం కొండాపూర్ గ్రామ శివారులో నిజామాబాద్ జిల్లా కమ్మర్ పల్లి మండలం కోనాపూర్ గ్రామానికి చెందిన మేకల శేఖర్ (35) కిరాణా షాపు నిర్వహిస్తూ, జీవనం సాగిస్తున్నాడని సులువుగా డబ్బులు సంపాదించాలన్న దురాలోచనతో కొండాపూర్ గ్రామ శివారులో నిషేధిత గుట్కాను అమ్ముతున్నారన్న పక్క సమాచారం మేరకు మేడిపల్లి ఎస్సై శ్యామ్ రాజ్ తనిఖీ నిర్వహించగా శేఖర్ అనే వ్యక్తి గంజాయిని తక్కువ ధరకు కొనుగోలు చేసి ఎక్కువ ధరకు అమ్ముకుందామని ఆలోచనతో తక్కువ ధరకు గంజాయిని కొనుగోలు చేసి తమ బంధువుల గ్రామమైన మేడిపల్లి మండలం కొండాపూర్ గ్రామం పరిసర గ్రామాల్లో ఉంచి, యువతకు గంజాయి తాగే అలవాటు ఉన్నవారికి అమ్ముకుంటూ లాభాలు గడిస్తున్నారు. గురువారం శేఖర్ తన వద్ద గల గంజాయిని మేడిపల్లి మండలం కొండాపూర్ చుట్టుపక్కల గ్రామాల్లో అమ్ముట కొరకు తన మోటార్ సైకిల్ పై వస్తున్నాడన్న పక్కా సమాచారంతో జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఆదేశాల మేరకు మెట్ పల్లి డిఎస్పీ ఉమా మహేశ్వరరావు పర్యవేక్షణలో కోరుట్ల సీఐ సురేష్ బాబు ఆధ్వర్యంలో మేడిపల్లి ఎస్సై శ్యామ్ రాజ్ సిబ్బంది అనిల్ కుమార్, చంద్రశేఖర్, దినేష్ లతో కలిసి కొండాపూర్ గ్రామ శివారులో నిందితుడు మేకల శేఖర్ తన మోటార్ సైకిల్ పై గంజాయి తరలిస్తుండగా పట్టుకొని అరెస్టు చేశారన్నారు. అతని వద్ద నుండి 565 గ్రాముల గంజాయి 01 మోటార్ సైకిల్ 01 సెల్ ఫోన్ ను స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు.
యువత ఏవరు కూడా చెడు వ్యసనాలకు మత్తు పదార్థాలకు బానిస కాకుండా ఉండాలని వాటికి అలవాటు పడి భవిష్యత్తును నాశనం చేసుకోవద్దన్నారు. ఎవరైనా గంజాయిని త్రాగిన కొన్న అమ్మిన చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. ఎవరైనా గంజాయి గురించి సమాచారం తెలియజేస్తే వారి సమాచారం గోప్యంగా ఉంచబడతాయని డీఎస్పీ ఉమా మహేశ్వర రావు తెలిపారు.
చాకచౌక్యంగా గంజాయి నిందితుడిని పట్టుకున్న మేడిపల్లి ఎస్సై శ్యామ్ రాజ్ సిబ్బంది లను ఎస్పీ, డిఎస్పీ లు అభినందించారు.
.