కార్మికరాలు అండగా ఉంటా -బిఆర్ టియు రాష్ట్ర కార్మిక నాయకుడు శ్రమశక్తి అవార్డు గ్రహీత రవిసింగ్...

తెలంగాణ ప్రభ (కుత్బుల్లాపూర్) జీడిమెట్ల ఇండస్ట్రీ ఏరియాలో "శ్రీ సత్య సాయి ఫాలీ ప్యాక్ షెడ్ నెంబర్ డీ-35, ఫేస్-4" కంపెనీలో సురేఖ అనే కార్మికురాలు గత కొన్ని సంవత్సరాల నుంచి పనిచేసేవారు, అనువార్య కారణాలవల్ల, కంపెనీ యజమాన్యం కార్మికరాలు సురేఖని తీసివేయడం జరిగింది. సురేఖ అనే కార్మికరాలకి గ్రాడ్యుయేట్ రూపాయలు రావాల్సి ఉండగా అవి ఇవ్వకపోవడంతో పలుమార్లు కంపెనీ యజమాన్యాన్ని అడిగి అడిగి విసుగు చెందిన కార్మికురాలు తమకు తెలిసిన కార్మిక మిత్రుల ద్వారా బిఆర్ టియు రాష్ట్ర కార్మిక నాయకుడు శ్రమశక్తి అవార్డు గ్రహీత రవిసింగ్ గురించి తెలుసుకొని తన ఆఫీస్ వద్దకు వచ్చి తనకు జరిగిన అన్యాయం గురించి వివరించారు.వెంటనే స్పందించిన కార్మిక నాయకుడు రవిసింగ్ హుటాహుటిన  కంపెనీ వద్దకు బయలుదేరి కంపెనీ యజమాన్యంతో చర్చించి కార్మికురాలు సురేఖ కి రావలసిన గ్రాడ్యుయేట్ డబ్బులు ఇప్పించారు.కార్మికురాలు సురేఖ మాట్లాడుతూ నాకు న్యాయం చేసిన కార్మిక నాయకుడు రవిసింగ్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నానని తెలిపారు.ఈ కార్యక్రమంలో అనిల్,సుదర్శన్,జగన్,కిరణ్,తదితరులు పాల్గొన్నారు.

.