నరేంద్ర మోడీ మందకృష్ణ మాదిగ చిత్రపటాలకు పాలాభిషేకం.

బిజెపి మండల అధ్యక్షుడు, ఎమ్మార్పీఎస్ నాయకులు.

ఎస్సీ వర్గీకరణ ఆమోదం హర్షనీయం.

తెలంగాణ ప్రభ (కోటగిరి): కోటగిరి మండల కేంద్రంలో బిజెపి మండల అధ్యక్షుడు ఎముల నవీన్, ఎమ్మార్పీఎస్ నాయకులు కలిసి నరేంద్ర మోడీ మందకృష్ణ మాదిగ చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమం సందర్భంగా బిజెపి మండల అధ్యక్షుడు ఏముల నవీన్ మాట్లాడుతూ....

ఎస్సీ ఉప కులాల వర్గీకరణ కు సుప్రీంకోర్టు ఆమోదం తెలుపుతూ తీర్పునివ్వడం హర్షనీయమన్నారు.గత 30 ఏళ్ల నుండి ఎస్సీ ఉప కులాల వర్గీకరణ కోసం పోరాటం చేస్తున్న మందకృష్ణ మాదిగ కృషికి ఫలితం దక్కిందన్నారు. ఆయన పోరాట ప్రతిఫలమే  నేటి సుప్రీంకోర్టు తీర్పు అని కొనియాడారు.ఎస్సీ ఉపకులాల వర్గీకరణ చేపట్టాలని మందకృష్ణ మాదిగ గత 30 ఏళ్లుగా చేస్తున్న పోరాటంలో ఎన్నో అవమానాలు ,ఎన్నో ఒడిదుడుకులు ఎదురైనప్పటికీ గుండె ధైర్యంతో ముందుకు సాగి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దృష్టికి విషయాన్ని తీసుకెళ్లగా మందకృష్ణ మాదిగ తో ఉన్న అనుబంధంతో మోడీ ఎస్సీ ఉపకులాల వర్గీకరణకు కేంద్ర ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేసేలా కృషి చేసి వర్గీకరణ ఆమోదం పొందేలా చేశారని గుర్తు చేశారు.  ఈ కార్యక్రమంలో బిజెపి సీనియర్ నాయకులు పుల్లెల మోహన్ రావు, దళిత రత్న గ్రహీత, ఉమ్మడి మండలాల ఇంచార్జ్ ఆర్టీసీ బోర్ర సాయన్న, కోటగిరి ఎమ్మార్పీఎస్ ఉపాధ్యక్షులు కన్నం శ్రీనివాస్, మాజీ సర్పంచులు ఆనంద్, హన్మంతు, ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు సొంపూర్ పోచిరాం, దావులయ్య,ఎత్తోండ జల్లయ్య,  చిన్న సాయిలు, లాలయ్య,పోశెట్టి ,అబ్బయ్య,గంగాధర్,లాలయ్య, పోశెట్టి,శ్రీకాంత్, సాయికృష్ణ, నవీన్, సాయి, శ్రీకాంత్,తదితరులు పాల్గొన్నారు.


.