హరిహర పుత్ర అయ్యప్ప ఆలయంలో కోటి ఎనిమిది లక్షల కుంకుమార్చన : రాచ విద్యాసాగర్ గురు స్వామి.

సిరిసిల్ల (తెలంగాణ ప్రభ) : సిరిసిల్ల పట్టణంలోని హరిహర పుత్ర అయ్యప్ప ఆలయంలో కోటి ఎనిమిది లక్షల కుంకుమార్చన నిర్వహించనున్నట్లు గురుస్వామి, ఆలయ వ్యవస్థాపకులు రాచ విద్యాసాగర్  తెలిపారు. గురువారం ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆలయాల మూడవ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఆగస్టు రెండో తేదీ నుండి 9వ తేదీ వరకు కోటి ఎనిమిది లక్షల కుంకుమార్చన పూజ నిర్వహించనున్నట్లు తెలిపారు. పూజలలో పాల్గొనేవారు ఎటువంటి రుసుము చెల్లించాల్సిన  అవసరం లేదని పూజకు సంబంధించిన సామాగ్రిని సైతం ఉచితంగా ఇవ్వనున్నట్లు తెలిపారు. పూజలలో పాల్గొనేవారు ఉదయం 9 గంటల లోగా ఆలయానికి చేరుకోవాలని కోరారు. సమావేశంలో సురేష్, గడ్డం భగవాన్, బొ ప్ప దేవయ్య, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

.