సేవాలాల్ సేన కమిటి ఆధ్వర్యంలో పాత్రికేయులకు సన్మానం.

తెలంగాణ ప్రభ (కోటగిరి) కోటగిరి మండల కేంద్రంలో ఉమ్మడి కోటగిరి మండలాల సేవాలాల్ సేన కమిటీ ఆధ్వర్యంలో పాత్రికేయులకు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమం సందర్భంగా జిల్లా సేవాలాల్ సేన కమిటీ  అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ... నూతనంగా ఎంపికైన  పాత్రికేయుల సంఘ కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలుపుతూ, ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.   సన్మాన సభ కార్యక్రమంలో భాగంగా వారు మాట్లాడుతూ...  ప్రపంచ ఆదివాసి గిరిజన సమస్యల ,హక్కుల, రిజర్వేషన్లపై   నిరంతరం పోరాటం చేస్తున్నామని జిల్లా సేవాలాల్  సేన అధ్యక్షులు సీతారాం నాయక్ పేర్కొన్నారు.  లంబాడా గిరిజన  సమస్యలను   పత్రిక రూపంలో  అధికారుల దృష్టికి తీసుకెళ్లి ప్రభుత్వం తరపున  గిరిజన, లంబాడ కులస్తులకు న్యాయం చేయాలని వారు కోరారు. 10% గిరిజన రిజర్వేషన్ పెంపు జీవో నంబర్ 33 కు చట్టబద్ధత కల్పించాలని కోరారు. నేషనల్ షెడ్యూల్ ట్రైబ్ పార్శర్  అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నిధులు రాష్ట్ర ప్రభుత్వం గిరిజన రైతులకు ఉపయోగించాలన్నారు. నూతన పాత్రికేయుల సంఘ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులతో పాటు సభ్యులందరూ పాల్గొన్నారు .పాత్రికేయుల బృదానికి  సన్మానించిన వారు సేవాలాల్ సేన జిల్లా అధ్యక్షుడు సీతారాం నాయక్ ప్రధాన కార్యదర్శి,రాజు, ఉపాధ్యక్షులు చౌహాన్ వెంకట్, రవి ,బాన్సువాడ డివిజన్ అధ్యక్షుడు ప్రకాష్ ,మండల అధ్యక్షులు వదిత్య తారసింగ్, ప్రధాన కార్యదర్శి కిషన్, సభ్యులు నారాయణ,ఫకీరా నాయక్ ,రాజు నాయక్ ,కళ్యాణ్ రామ్ చందర్, శ్రీకాంత్, అశోక్ ,తదితరులు పాల్గొన్నారు.

.