మైక్రో ఫైనాన్స్ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలి : ముషం రమేష్, సిపిఎం జిల్లా కార్యదర్శి.

సిరిసిల్ల (తెలంగాణ ప్రభ). మైక్రో ఫైనాన్స్ వేధింపుల పై చర్యలు తీసుకోవాలని సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ ప్రభుత్వాన్ని కోరారు. అంబేద్కర్ చౌరస్తా వద్ద వస్త్ర పరిశ్రమ జేఏసీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న దీక్షలు గురువారం 11 రోజుకు చేరుకున్నాయి. దీక్షలను ప్రారంభించిన  రమేష్ మాట్లాడుతూ గత ఏడు మాసాలుగా కార్మికులకు పని లేకుండా పోవడంతో పరిశ్రమకు అనుబంధ పరిశ్రమల్లో పనిచేస్తున్న కార్మికులు తీవ్రంగా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారని అన్నారు. ఆదాయం లేకపోవడంతో మైక్రో ఫైనాన్స్ ల వేధింపుల వల్ల కార్మికుల కుటుంబాలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నాయని తెలిపారు. కొంతకాలం మైక్రో ఫైనాన్స్ లు వేధింపులు ఆపేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. తక్షణం జేఏసీ డిమాండ్ పరిష్కరించి సమ్మె విరమణ జరిగేలా చూడాలని కోరారు. దీక్షలో పలువురు నాయకులు పాల్గొన్నారు.

.