కనవేని చక్రధర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ కో- కన్వీనర్.
సిరిసిల్ల (తెలంగాణ ప్రభ) అసెంబ్లీలో నల్ల బ్యాడ్జీలతో బిఆర్ఎస్ నిరసన తెలపడం అవమానకరమని కాంగ్రెస్ కరీంనగర్ పార్లమెంట్ కో కన్వీనర్ కనివేని చక్రధర్ రెడ్డి విమర్శించారు.గురువారం సిరిసిల్లలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో చక్రధర్ రెడ్డి తో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి మీడియాతో మాట్లాడుతూ మహిళలను అవమానపరచారు అంటూ నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపే తీరుపై మండిపడ్డారు. గతంలో బిఆర్ఎస్ పార్టీ మంత్రివర్గంలో మహిళలకు వారికి పదవులు ఇవ్వకుండా అవమానపరిచిందని, డీకే అరుణ, ఆనాటి గవర్నర్ తమిళసై పై బిఆర్ఎస్ అధినేత కేసిఆర్ వైఖరిని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీలో మాత్రమే మహిళలకు తగిన గౌరవం ఇస్తున్నామని అన్నారు. ప్రజలు వాస్తవాలు గమనిస్తున్నారని తెలిపారు. సమావేశంలో వైద్య శివప్రసాద్.ఎల్లె లక్ష్మీనారాయణ. వెలుముల తిరుపతిరెడ్డి.మ్యాన ప్రసాద్ , కటకం రాజశేఖర్ తదితర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
