కోటగిరి నూతన తహసీల్దార్ గా కాంబ్లే గంగాధర్ నియామకం.

తెలంగాణ ప్రభ (కోటగిరి): కోటగిరి మండల తహసిల్దార్ గా కాంబ్లే గంగాధర్ పదవి బాధ్యతలు చేపట్టారు. ఆయన బోధన్  నుండి బదిపై కోటగిరి కార్యాలయనికి తహసీల్దార్ గా రావడం జరిగిందన్నారు.తహసీల్దార్ మాట్లాడుతూ ...మండల కేంద్రంలోని రైతులకు వ్యవసాయపరంగా ఏమైనా సమస్యలు ఉన్న వాటిని పరిష్కరించి వారికి న్యాయం చేస్తానని పాత్రికేయులతో తెలిపారు. పాఠశాల  విద్యార్థుల  సర్టిఫికెట్లను సమయపాలనలో వారికి అందజేస్తామని పేర్కొన్నారు. అందుబాటులో ఉంటూ రైతాంగానికి, ప్రజలకు అధికారికంగా రెవిన్యూ తరఫున సకాలంలో పనులు చేపట్టి వాళ్లకు సమస్యలు తీరుస్తానని అన్నారు. ఆయన వెంట ఆర్ఐ సయ్యద్ హుస్సేన్, రెవిన్యూ సిబ్బంది తదితరులు ఉన్నారు.

.