బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు, పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగానిరసన సీఎం రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మ దహనం

తెలంగాణ ప్రభ (కోరుట్ల): జగిత్యాల జిల్లా  కథలాపూర్ మండలంలో బీఆర్ఎస్ పార్టీ లోక బాపురెడ్డి ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేశారు. 

మహిళ శాసన సభ్యురాలు సబితా ఇంద్రా రెడ్డి, పైన సునీత లక్ష్మారెడ్డి, పట్ల చేసిన అనుచిత వాఖ్యలు చేసిన సీఎం రేవంత్ రెడ్డి మాటలకూ  ఈరోజున నిరసన తెలుపుతూ వారి దిష్టి బొమ్మ దహనం చేశారు.

కథలాపూర్ మండల కేంద్రంలో దహనం చేసి నిరసన తెలిపారు, 

రాష్ట్ర మార్క్ ఫెడ్ మాజీ చైర్మన్ లోక బాపు రెడ్డి. మాట్లాడుతూ నిన్న నిండు సభలో మహిళా నాయకురాలు సబితా ఇంద్రా రెడ్డి,ని సునీత లక్ష్మారెడ్డి పైన వారు చేసిన మాటలు అక్కలను నమ్ముకుంటే బస్ స్టాండ్ పాలు అవుతారు. మన తెలంగాణ సంస్కృతిలో ఆడబిడ్డలకు ప్రత్యేకమైన గౌరవం ఉంటుంది, అలాగే ఆడబిడ్డలను పూజిస్తాం,గౌరవిస్తారు ప్రతి మంచి కార్యక్రమానికి ఆడబిడ్డలతో ప్రారంభోత్సవం చేయించి జరుపుకుంటాం. తెలంగాణలో అన్ని మంచి పనులకు ఆడబిడ్డలే ముందుండి నడిపిస్తారు, అలాంటి ఆడబిడ్డలను అవమానించినందుకు    సీఎం రేవంత్ రెడ్డిని, నిన్న మహిళ శాసన సభ్యుల పైన చేసిన వారి వ్యాఖ్యలను వాపస్ తీసుకుకోవాలి, వారిని ఎక్కడ వ్యాఖ్యలు చేశారో అక్కడే వారికి క్షమాపణ చెప్పాలి. 

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ప్రజలకు ఇచ్చిన అబద్ధాలు 6 గ్యారెంటీలు ఎక్కడ అమలు కాలేవు.  రుణమాఫీ లో ఒక లక్ష, గత రెండు రోజుల నుండి 1,50,000 వరకు  మాఫీ చెపుతున్న మాటల్లో అందులో దాదాపుగా 50% శాతం కూడా పూర్తి కాలేదు. రుణ మాపి విషయంలో వ్యవసాయ మంత్రి, రేషన్ కార్డు లేకుండా కూడా  ఎట్లా అంటున్నారు. కానీ సీఎం రేవంత్ రెడ్డి రుణ మాపికి రేషన్ కార్డు ఉంటేనే జరుగుతాయి, అని వాక్యాలు చేయడం మంత్రులకు అవగాహన లేదు. తెలంగాణ లో కెసిఆర్ సీఎం గా ఉన్నప్పుడు వరి నాట్లు పడకముందే రైతుల ఖాతాల్లో రైతుబంధు డబ్బులు జమ చేశారు. కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్ రెడ్డి వరి నాట్లు వేసిన ఇంకా రైతు ఖాతాలో రైతుబంధు పడక పోవడం చూస్తే మీ పాలనా ప్రజలకు అర్థం అవుతుంది.  తెలంగాణ రాష్ట్ర ప్రజలు అన్ని చూస్తున్నారు రానున్న రోజులలో ప్రజలే మీకు గుణపాఠం చెపుతారు, మళ్ళీ కెసిఆర్ ని నాయకత్వం బిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది అని తెలిపారు. ఈ కార్యక్రమంలో  కథలాపూర్ మండల మాజీ  జడ్పీటీసీ నాగం భూమయ్య, ఎంపీపీ జవ్వాజి రేవతి గణేష్,మార్కెట్ కమిటీ  చైర్మన్ వర్ధినేని నాగేశ్వర్ రావు,వైస్ ఎంపీపీ గండ్ర కిరణ్ రావు,మాజీ ఎంపీటీసీలు మల్యాల రమేష్, వేముల గంగరాజం,మామిడి పెల్లి రవి,కో ఆప్షన్ సభ్యులు ఎండీ రఫీ,మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నాంపెల్లి లింబాద్రి,మాజీ సర్పంచులు జావిడి ప్రతాప్ రెడ్డి ఎంపీటీసీలు,డైరెక్టర్లు జెల్ల వేణుగోపాల్,   ఏజీబీ మహేందర్, ఆది రెడ్డి, చౌదరి,శంకర్,బద్దం మహేందర్, బి ఆర్ ఎస్ పార్టీ మండల శాఖ మాజీ అధ్యక్షులు కల్లెడ శంకర్,పురుకుటపు గంగారెడ్డి, సూర్నేని వినోద్ రావు,గడ్డం శేఖర్ రెడ్డి,పుండ్ర జనార్దన్,గడ్డం (దులూరు)శేఖర్, కొత్త పెల్లి శ్రీను,బాల్క సంజీవ్,రాయి కంటి శేఖర్, ముస్క కృష్ణ,రాచర్ల రవి,నల్ల గంగాధర్, చెక్క పెల్లి రాజ కుమార్,మంచాల మహేష్, పాలేపు రాజేష్,ఎండీ ఇర్ఫాన్,తెడ్డు ప్రశాంత్,వంగరి రాజ్ కుమార్, పడాల భూమేష్,తీరు జానీ, మండల,గ్రామ వివిధ హోదలలో ఉన్న మండల బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు తదితరులు ఉన్నారు.

.