జగిత్యాల జిల్లా మున్నూరుకాపు ఉపాధ్యక్షుడికి సన్మానం

తెలంగాణ ప్రభ (కోరుట్ల): జగిత్యాల జిల్లా మున్నూరుకాపు ఉపాధ్యక్షులుగా ఎన్నికైన బండారి శంకర్ ని కోరుట్ల పట్టణ శ్రీరామా మున్నూరుకాపు యువజన సంఘం వారి ఆధ్వర్యంలో సన్మానించడం జరిగింది. బండారి శంకర్ మాట్లాడుతూ నాపై నమ్మకంతో జగిత్యాల జిల్లా మున్నూరు కాపు సంఘం ఉపాధ్యక్షులుగా ఎన్నుకున్న సంఘ సభ్యులకు పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతూ సంఘ అభివృద్ధికి అందరి సహాయ సహకారాలతో ఇంకా ఎంతగానో కృషి చేస్తానని ఆయన చెప్పారు ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు శ్రీరాములు, రాజు, నీలి అంజనేయులు, సంఘ అధ్యక్షులు చెట్లపెల్లి సాగర్, ఉపాధ్యక్షులు బండారి శ్రీనివాస్,  కృష్ణంరాజు, జీవన్, అజిత్, రాజేష్ మరియు సంఘ సభ్యులు పాల్గొన్నారు.

.