జిల్లా స్థాయి మండల వైద్యాధికారి, అధికారుల సమీక్ష సమావేశంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్.

తెలంగాణ ప్రభ (కోరుట్ల): జగిత్యాల పట్టణంలో బుధవారం రోజున కలెక్టరేట్ ఆడిటోరియం ఎంపీఓ, ఎంపీడీవో, మండల వైద్యాధికారి, పీహెచ్ సీ ఆశ వర్కర్ సూపర్వైజర్లతో, సమీక్ష నిర్వహించారు.  జిల్లా వ్యాప్తంగా మండలంలో వారీగా సీజన్ వ్యాధుల పట్ల  డెంగ్యూ కేసులపై మండల ప్రాథమిక ఆసుపత్రిలో నమోదైన డెంగ్యూ ఫీవర్ కేసులపై  ఆరా తీశారు. 

క్షేత్రస్థాయిలో కేసుల వివరాలు తెలుసుకున్నారు.

ప్రతి గ్రామంలో ఆశ వర్కర్ ఇంటింటికి తిరిగి ఫీవర్ సర్వే చేయాలని , గ్రామ పంచాయతీలు చెత్త ట్రాక్టర్లు ఇంటింటికి తిరిగి చెత్తను సేకరించాలని, డ్రైనేజీ వ్యవస్థను ఎప్పటికప్పుడు శుభ్రపరచాలని, డ్రైనేజీ శానిటేషన్ నిత్యం జరపాలని పంచాయతీ సెక్రెటరీ గ్రామాలు పరిశుభ్రత పై క్షేత్రస్థాయిలో మెరుగుపరచాలని ఆయన సూచించారు.  కొడిమ్యాల , కథలాపూర్, కిలాగడ్డ, పి హెచ్ సి లు, 80 డెంగ్యూ కేసులు నమోదయ్యాయని ఆయన తెలిపారు. క్షేత్రస్థాయిలో ఫీవర్ సర్వే చేయాలని, ఫీవర్ వచ్చిన వారికి తక్షణమే పరీక్షలు నిర్వహించాలని,డెంగ్యూ కేసులపై ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.  జిల్లా వ్యాప్తంగా ఎంపీడీవో, ఎంపీఓ, అందరూ కచ్చితంగా పంచాయతీ సెక్రటరీలు సమయపాలన పాటించాలని ఆయన ఆదేశాలు ఇచ్చారు. సమయానికి రాని పంచాయతీ సెక్రెటరీలను సస్పెండ్ చేయాలని ఎంపీడీవోలకు ఆదేశాలు జారీ చేశారు.

ఈ  కార్యక్రమములో , అదనపు కలెక్టర్ (లోకల్ బాడీస్) గౌతమ్ రెడ్డి, డిపిఓ, రఘువరన్ జిల్లా ఈరోజు సంబంధిత అధికారులు ,తదితరులు పాల్గొన్నారు.

.