కోరుట్లలో మున్నూరుకాపు సంఘం ఆధ్వర్యంలో బోనాల పండుగ

తెలంగాణ ప్రభ (కోరుట్ల): జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో వైభవంగా బోనాల పండుగ నిర్వహించారు.

కోరుట్ల మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో బోనాల పండుగ బ్రహ్మాండంగా జరిగినది ఇందులో ముఖ్య అథితిగా జగిత్యాల జిల్లా మున్నూరు కాపు సంఘ అధ్యక్షులు చెదలు సత్యనారాయణ వారిని  సంఘ సభ్యులు ఘనంగా సన్మానించారు.

తర్వాత చెదలు సత్యనారాయణ స్వయంగా బోనం ఎత్తుకున్నారు.

సంఘ సభ్యులు, పట్టణ ప్రముఖులు అందరు కలిసి ఊరేగింపు ద్వారా బోనం తీసుకొని అమ్మవారికి మొక్కులు చెల్లించినారు. ఇట్టి కార్యక్రమంలో జగిత్యాల జిల్లా ఉపాధ్యక్షులు బండారి శంకర్, కోరుట్ల ఆమ్ సంఘం అధ్యక్షులు ఎలిశెట్టి గంగారెడ్డి, సంఘ గౌరవ అధ్యక్షులు కసుల గంగారెడ్డి, అధ్యక్షులు నీలి శ్రీనివాస్, సంఘ కార్యదర్శి అమరేందర్, కిరణ్, రాజలింగం, శ్రీధర్, రాజేష్, కౌన్సిలర్ తిరుమల గంగాధర్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షురాలు మచ్చ కవిత, నర్సయ్య, భూమయ్య, రమేష్, సత్యనారాయణ, అజయ్ తదితరులు పాల్గొన్నారు.

.