కోరుట్ల డాగ్ బంగ్లా మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు పదవి విరమణ

తెలంగాణ ప్రభ (కోరుట్ల): జగిత్యాల జిల్లా కోరుట్లపట్టణంలోని డాగ్ బంగ్లా మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు అంకం ప్రతాప్ ఈరోజు పదవి విరమణ  చేశారు.

ప్రభుత్వ ఉద్యోగి పదవీ విరమణ సన్మాన ఉత్సవం డాగ్ బంగ్లా మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఆవరణంలో నిర్వహించారు.

ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ ప్రతి ప్రభుత్వ ఉద్యోగి సేవలు అందించి, వాళ్ళ నైపుణ్యాన్ని నిరూపించుకోవాలని వారు అన్నారు. మీ హయంలో విద్యార్థులు ఎంతో తెలివితేటలతో ఉన్నంత స్థాయికి ఎదిగారని, వారి ఎదుగుదలనే ప్రభుత్వ ఉద్యోగికి తృప్తినిస్తాయని వారు పేర్కొన్నారు 

ప్రధానోపాధ్యాయులు అంకం ప్రతాప్ మాట్లాడుతూ స్కూల్ పిల్లలతో తనకున్న అనుబంధాన్ని నెమరు వేసుకుంటూ, గత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ, విద్యార్థులు,తన తోటి ఉపాధ్యాయులు తనకు ఎంతో సహకరించారని, జ్ఞాపకం చేసుకుంటూ, తనకు సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో కోరుట్ల ఎంఈఓ గంగుల నరేశన్, జిల్లా పరిషత్ బాలికల పాఠశాల ప్రధానోపాధ్యాయులు కృష్ణ మోహన్, 21వ వార్డ్ కౌన్సిలర్ అన్వర్ తదితరులు పాల్గొన్నారు.

.