తెలంగాణ ప్రభ (నర్సాపూర్): నర్సాపూర్ నియోజకవర్గంలోని హత్నూర మండల పరిధిలోని దౌల్తాబాద్ జెడ్ పి హెచ్ ఎస్ స్కూల్లోవారంతా చిన్న నాటి స్నేహితులు... ఒకే చోట చదువుకున్నారు.. పదో తరగతి పూర్తయి 26 సంవత్సరాల తర్వాత ఒక వేదిక ఏర్పాటు చేసుకొని చిన్నటి జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నారు కొంతమంది ఉద్యోగంలో స్థిరపడగా మరికొంతమంది వ్యాపారం. ఇతర రంగాల్లో కొనసాగుతున్నారు, మండల పరిధిలోని సంగారెడ్డి జిల్లా మండల పరిధిలోని దౌల్తాబాద్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1997-98 బ్యాచ్ కి చెందిన పూర్వ విద్యార్థిని విద్యార్థులు బుధవారం మండల పరిధిలోని ఒక ఫంక్షన్ హాల్ లో ఆత్మీయ సమ్మేళనంలొ పాల్గొన్నారు. ఆత్మీయంగా పలకరింపులు, ఆ లింగనాల, నడుమ నాటి మధుర స్మృతులను నెమరేసుకున్నారు, విద్యా బుద్ధులు నేర్పిన గురువులు ఫకీర్ మహమ్మద్. నవాబ్ రెడ్డి ,విట్టల్ , రాములు , నర్సింలు. శివానంద్. శ్రీనివాస్, ఫజల్ అన్న లను శాలువతో ఘనంగా సన్మానించారు, పూర్వ విద్యార్థులందరూ ఒకే చోట చేరడంతో సందడిగా నెలకొంది, ఇకనుండి అందరూ టచ్ లో ఉండాలంటూ ఫోన్ నెంబర్లు తీసుకోవడం తో పాటు ఈ మధుర జ్ఞాపకాలను తమ తమ సెల్ ఫోన్లో బంధించుకున్నారు...
