ఇబ్రహీంపట్నం మండలం డబ్బ గ్రామంలో డెంగ్యూ ప్రభావిత ప్రాంతాల్లో డ్రైనేజీ వ్యవస్థను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్.

తెలంగాణ ప్రభ (కోరుట్ల) : జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం డబ్బ గ్రామంలో బుధవారం రోజున జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ శానిటేషన్ పరిశీలించారు. గ్రామంలో నిల్వ ఉన్న డ్రైనేజీ మురుగునీరు శుభ్ర పరచాలని శానిటేషన్ ఎప్పటికప్పుడు నిర్వహించాలని. అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. అనంతరం గ్రామంలో పలు ఇండ్లలో తిరిగి గ్రామస్తులను ఆశ వర్కర్లు వస్తున్నారా లేదా సీజనల్ వ్యాధుల పట్ల ఇంటింటికి తిరిగి వివరాలు సేకరిస్తున్నారా అని స్వయంగా అడిగి తెలుసుకున్నారు.            అనంతరం గ్రామంలో డంపు యార్డు పరిశీలించి గ్రామంలో చెత్త, తడి చెత్త, పోడి చెత్త సేకరిస్తున్నారు అని తెలుసుకున్నారు.

ఈ  కార్యక్రమంలో ఆర్డివో, శ్రీనివాస్, డిప్యూటీ టీమ్ హెచ్ ఓ శ్రీనివాస్, ఎమ్మార్వో ఎంపీడీవో , ఎంపీఓ, సంబంధిత, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

.