డి సి హెచ్ ఎస్ గా డాక్టర్ పంతగాని పెంచలయ్య.

సిరిసిల్ల. (తెలంగాణ ప్రభ) జిల్లా కేంద్రంలోని ప్రధాన ఆసుపత్రిలో బుధవారం ఆసుపత్రుల సమన్వయ అధికారి డి సి హెచ్ ఎస్ గా ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ పంతగాని పెంచలయ్య బాధ్యతలు స్వీకరించారు. సర్జన్ గా మంచి గుర్తింపు పొంది రికార్డు స్థాయిలో ఆపరేషన్లు చేసిన అనుభవం కలిగిన డాక్టర్ గా ప్రజల్లో ఆదరణ పొందారు. ఈ సందర్భంగా డాక్టర్ పంతగాని పెంచలయ్య మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తానని తెలిపారు.

.