మధ్యాహ్న భోజన కార్మికుల సమస్య పరిష్కరించాలని ఏఐటీయూసీ నాయకులు డిమాండ్.

తెలంగాణ ప్రభ (కోటగిరి): కోటగిరి మండల కేంద్రంలో రాష్ట్ర ఏఐటీయూసీ పిలుపు మేరకు తహసీల్దార్ కార్యాలయం ముందు  ఏఐటియూసి జిల్లా నాయకులు ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజన కార్మికులు ధర్నా నిర్వహించారు. ఈ ధర్నా సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా నాయకులు దుబాస్ రాములు, విట్టల్ గౌడ్ మాట్లాడుతూ... రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందు  మధ్యాహ్నం భోజన కార్మికుల సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు.   కార్మికులు అప్పులు చేసి విద్యారిని, విద్యార్థుల భోజనం పెడుతున్నారన్నారు.  కార్మికులను సమస్యను పరిష్కరిస్తామని మాట ఇచ్చి   ఆరు నెలలు గడిచిన  ఇప్పటివరకు మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరిష్కరించలేదని మండిపడ్డారు.  మధ్యాహ్న భోజన కార్మికుల కనీస వేతనాలు 10000 రూపాయలు చెల్లిస్తామని,  వంట పాత్రలు కొనిస్తామన్నారు. జిల్లాకు 10 కోట్లు బిల్లులు  పెండింగ్లో ఉన్నాయని వాటిని వెంటనే విడుదల చేయాలని, మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరిష్కరించాలని చలో చలో హైదరాబాద్ వెళ్లే కార్యక్రమం చేపడితే ఏఐటీయూసీ నాయకులకు అక్రమంగా అరెస్టు చేయడం జరిగిందని వారిని వెంటనే బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మధ్యాహ్న భోజన కార్మికులు ఆలీ, వీరేశం, ఉష, సరిత, సత్యవతి, నాగమణి, రమణమ్మ, సిపిఐ నాయకులు నల్ల గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.

.