తెలంగాణ ప్రభ (కోరుట్ల): బీసీల హక్కులను కాలరాస్తున్న సర్కార్ ఎన్నికలకు ముందు ఒక మాట ఎన్నికయ్యాక మరో మాట బీసీల నోటికాడి ముద్ద లాక్కుంటారా...? ఇది ముమ్మాటికి చాలా అన్యాయమని బీసీ సంక్షేమ సంఘం జగిత్యాల జిల్లా ఉపాధ్యక్షులు ఉరుమడ్ల శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ 2024 అసెంబ్లీ ఎన్నికలకు ముందు కామారెడ్డిలో ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే 100 రోజుల లోపు ఓ బి సి డిక్లరేషన్ చేసి ,బీసీ కుల గణన చేసి బీసీలకు అదనంగా కమిషన్ నివేదిక ఆధారంగా రిజర్వేషన్లు పెంచుతామన్నారు. మొన్నటి అసెంబ్లీ సమావేశాలలో బీసీ డిక్లరేషన్ పై ఊసే ఎత్తలేదని బీసీలకు ప్రభుత్వంపై పూర్తి విశ్వాసం ఉన్నందున ఎవరు ప్రశ్నించలేరని ఇప్పుడు ప్రభుత్వం మనసులో ఉన్న దురుద్దేశం బయటపడిందని, బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇస్తామని హామీ ఇచ్చి ప్రస్తుతం మొండి చేయి చూపించడం ఇది బీసీలపై తీవ్ర వివక్ష చూపించడమేనని ఇది తెలంగాణ రాష్ట్రంలో బీసీల ఆత్మగౌరవాన్ని నయవంచన చేయడమేనని బీసీల నోటికాడి ముద్ద లాగి ఇతరులకు లబ్ధి చేకూర్చడమే అవుతుందని స్పష్టం చేశారు.
ఇప్పటికైనా తక్షణమే ఓబీసీ కుల గణన నిర్వహించిన తర్వాతే ఎలక్షన్లకు వెళ్లాలని బీసీల హక్కుల సాధన కోసం బీసీలందరూ ఏకమై 42 శాతం రిజర్వేషన్ కోసం ఉద్యమించవలసిన అవసరం ఎంతైనా ఉందని పేర్కొన్నారు.
.