తెలంగాణ ప్రభ ( సిరిసిల్ల): సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి సారధి కళాకారులు మంగళవారం గాంధీ చౌరస్తా వద్ద పాలభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా సాంస్కృతిక కళాకారుల సంఘం అధ్యక్షులు ఎడమల శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ కళాకారులు ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న పిఆర్సి తో కలుపుకొని జీవితాలు రావడంతో రాష్ట్రంలో ఉన్న 583 మంది కళాకారుల జీవితాల్లో వెలుగు నిండిందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలపై విస్తృతంగా ప్రచారం చేస్తామని తెలిపారు. పిఆర్సి పెంచేందుకు సహకరించిన మంత్రులకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో కళాకారులు శ్రీరాముల రామచంద్రం, గడ్డం దేవయ్య, గడ్డం శ్రీనివాస్, పోత్తూరు రాజు, వంతులదుపుల ఝాన్సీ, గుగ్గిళ్ళ పరిశ్రమలు, పూడూరు సంజీవ్, కిన్నెర శ్రీలత, అనుముల శిరీష, లావణ్య, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు చొప్పదండి ప్రకాష్, గడ్డం నరసయ్య, నీలి రవీందర్, కళాకారులు కమ్మరి తిరుపతి, ఆకులు దేవయ్య పాల్గొన్నారు.
