తెలంగాణ ప్రభ ( సిరిసిల్ల): చిన్మయ మిషన్ ఆధ్వర్యంలో శివనగర్ శివాలయంలో భగవద్గీత భజగోవిందం పై యజ్ఞనంద స్వామి మంగళవారం ప్రబోధించారు. జీవిస్తున్నంత కాలంలోనే పుణ్యకర్మలు చేయాలని అన్నారు. ఆగస్టు మూడో తేదీ వరకు జరిగే ప్రవచనాల కార్యక్రమాన్ని భక్తులు సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు కోరారు. కార్యక్రమంలో సజ్జనం శ్రీనివాస్, సిరిపురం కృష్ణ, లకావత్ మోతిలాల్, నల్ల సత్యనారాయణ, మల్లేశం, కమలాకర్, రామచంద్రం, అరుణ తదితరులు పాల్గొన్నారు.
